Yogavasista

క్రియాయోగము


క్రియాయోగము

పరమాత్మే ఆదిపురుషుడు. పరాప్రకృతిని కలిగి ఉన్నాడు.   పరాప్రకృతియే రాధ.  ప్రత్యేకంగాగనపడే ప్రతి జీవాత్మయు అతడే.  సత్ అనగా అస్తిత్వం (EXISTANCE). చిత్ అనగా జాగరణ.  ఆనందం అనగా క ర్తృకము మరియు అక ర్తృకము.  మానవుడు తృటిలోకర్మాబద్ధుడు.  కర్మననుసరించి జన్మ వచ్చును.  గ్రహరాశులు  మనిషికి తన కర్మ ప్రకారము అంగీకృతమైనపుడు, సూక్ష్మశరీరము మాతృయోనియందు ప్రవేశించి, స్థూలశరీర నిర్మాణమునకు ఉపయుక్తమగును. మరణము అనగా స్థూల సూక్ష్మ శరీరములు రెండును జన్మ కారణమైన ప్రారబ్ధకర్మ పూర్తిఅగుటతో విడిపోవుట.  మానవుడు సజీవముగా నున్నప్పుడే చైతన్యస్ఫూర్తితో శరీరమును ఆత్మను వేరుచేయు స్థితికి చేరుకున్నచో మరణము బాధించదు.  కాని ఇట్టి స్థితికి చేరుకొనుటకు క్రమముతప్పని దృఢని శ్చయముతో చేయు ధ్యానము అవసరము.  సద్గురువు కృప వలన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అన్నహత, విశుద్ధ మరియు ఆజ్ఞా పాజిటివ్ లున్న బ్రహ్మదండినిశుద్ధము చేసి సాధకునిలోని సహజముగనున్న అనంతమైన కుండలినీ శక్తిని ప్రజ్వరిల్లజేయును. దీనివలన సాధకునకు (1) జ్యోతిదర్శనము (2) శబ్దము ( ఓం ) (3) ప్రకంపన ( trance vibration) కలుగును. అప్పుడు కుండలినీశక్తి ఉత్తే జించబడి ఆరుచక్రములలో పరిభ్రమించబడి మెదడునకు చేరును.
అప్పుడు సాధకుడు దైవశక్తియుతుడు అగును.
క్రియాయోగములో మహాముద్ర, క్రియా మరియు జ్యోతిముద్ర అనే మూడు ముఖ్య విషయములు,  హంస, ఓం మొదలగు అనేక ఉప ప్రక్రియలు ఉంటాయి.      
మహాముద్ర మేరుదండమును సరిచేయుటకు అయస్కాంతీకరణము చేయుటకు ఉపయోగపడుతుంది.
మితాహారంవలననూ , రోగములేకుండానూ ఉన్నప్పుడు మరియు  సౌరశక్తి వలననూ పొందకలిగే ఒక సంవత్సరం శక్తిని, శారీరక మరియు మానసిక మార్పులను  , సాధకుడు ప్రాణశక్తిని బ్రహ్మదండి చుట్టి వచ్చు ఒక క్రియద్వారా సాధించవచ్చును.

ఇడా పింగళ మరియు సుషుమ్నల కలయికని లేదా కూటస్థ చైతన్యాన్నికేంద్రీకరించి జ్యోతిదర్శనమునకు ఉపయోగకారి జ్యోతిముద్ర.
హఠయోగము అనగా సూర్య చంద్రుల కలయిక.  దీనినే ప్రాణ అపాన వాయువుల కలయిక అంటారు.  హఠయోగములో  ప్రాణాయామము, ఆసనములు, బంధములు మరియు ముద్రలు ద్వారా శరీరము వశములో ఉంచబడుతుంది.

రాజయోగమనగా మనస్సును వశపరచుకొనుట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార (ఇంద్రియములను వశములో ఉంచుకొనుట), ధారణ(ఏకాగ్రత), ధ్యానము మరియు సమాధి అనే ఎనిమిది అంగములుగలది రాజయోగము.

ప్రాణాయామము రాజయోగములో ప్రధానమైనది.  దీనివలన హృదయస్పందన, నాడీ స్పందన, మనస్సు మరియు  ప్రాణశక్తి వశమునందుండును.
.మంత్రయోగములోని శబ్దములు  ఆత్మ పరమాత్మల కలయికకి దోహదపడును.
లయయోగము అనగా పూర్తిగా మనస్సును వస్తువు మీద లగ్నము చేయుట. క్రియయోగ సాధనమైన ఒక పద్ధతిద్వారా మనస్సు ఓంకారశాబ్దమున లయమగును.
క్రియా యోగమున జపయోగముకూడా మిళితమైయున్నది.
కనుక క్రియాయోగము అన్ని యోగములసారము.  అనగా హఠయోగము లోని కొన్ని శారీరక వ్యాయామములను, రాజయోగములోని ప్రాణాయామ, ధారణ, ధ్యాన ప్రక్రియలని, లయయోగము లోని సారాంశాన్ని, జపయోగము లోని సారాంశాన్నిమిళితము చేసియున్నది.
క్రియాయోగము ద్వారా షట్ చక్రములయండు నిక్షిప్తమైయున్న గ్రహములయొక్క, నక్షత్రములయొక్క చెడులనుండి  విముక్తుడగుటకు దారి లభ్యమగును.

మన స్థూల శరీరములో బ్రహ్మగ్రంథి,  విష్ణుగ్రంథి, మరియు రుద్ర గ్రంథి,  అని మూడు గ్రంథులు గలవు.

బ్రహ్మగ్రంథి:  మూలాధారమునుండి మణిపూరకము వఱకు వ్యాపించియున్న ఈ గ్రంథి మానవచైతన్యమునకు సంబంధించిన భౌతిక విషయాశక్తి యందు లగ్నమైయుండును.

విష్ణుగ్రంథి: ఇది మణిపూరకమునుండి పిట్యుటరీగ్రంథి  వఱకు వ్యాపించియున్న ఈ గ్రంథి పంచ జ్ఞానేంద్రియాలనుభౌతిక విషయాశక్తి యందు లగ్నము చేయించును. అందువలన మనస్సు భగవత్ అనుభూతిని పొందనీయదు.

రుద్రగ్రంథి: ఇది పిట్యుటరీగ్రంథి మరియు ఉచ్చి గుంట నడుమనున్నది.  ఈ గ్రంథి మీద దృష్టి కేంద్రీకరించిన సాధకుడు కపాలమందున్న భగవానుని దర్శించగలడు.

మానవరూపములోనున్న నిరాకారత్వము క్రియాయోగముద్వారా సులభముగా ఎఱుకబడును.
ఈ క్రియాయోగముద్వారా ప్రతిఒక్కరూ నరముల బలహీనత, నీరసము, అలసట, కోపము, విచారము, భయము, అకాలమృత్యువు, తొలగించుకొని బ్రహ్మ మస్తిష్కము , చిన్నమెదడు మధ్యనున్న దైవత్వమును దర్శించగలుగుతాడు.

క్రియాయోగములో మేరుదండమును Antenna గా చేసి షట్ చక్రాలద్వారా dissipate అయిన  energyని తిరిగి వెనక్కి మలచి మేరుదండం ద్వారా సహస్రారానికి ఇడ, పింగళ మరియు సుషుమ్నాద్వారా పంప వీలవుతుంది.

ఆపస్తంభ సూత్రము:

వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్ఠాః ప్రేత్య
కర్మఫలం అనభూయతతః శేషేణ
విశిష్ట  దేశజాతి కులరూపాయుః శృతి
వృత్తవిత్త సుఖమేధసో జన్మప్రతిపద్యంతే

స్వకర్మ నిష్ఠులగు బ్రాహ్మణాదులును , బ్రహ్మచార్యాదులును పరలోకమున తమతమ కర్మఫలములననుభవించి అంతట సంచిత శేషముతో విశేషయుక్తమగు దేశాజాతి కులరూప ఆయుర్విద్యాచార ధనసుఖ బుద్ధులు కలవారుగా జన్మింతురు.

ప్రాణాయామౌ దేహేద్దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషం
ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనాన్ ఈశ్వరాన్ గుణాన్ ...........  మనువు
ప్రాణాయామముచే రాగాది చిత్తదోషముల గాల్చవలయును.
ధారణావశమున పాపమును
ప్రత్యాహారముచే  ఇంద్రియములకు కలుగు విషయ సంసర్గములను ధ్యానముచే అనీశ్వరగుణములను లోభాదులను కాల్చివేయవలయును.
కనుక శ్రౌతస్మార్తకృత్యములు చేయవలయును.
శ్రౌతం అనగా అగ్నిహోత్రాది క్రియలు.(rites)
స్మార్తము అనగా ఔపాసనాది క్రియలు. (rites).




Translate