Yogavasista

కుండలిని



కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడుహఠయోగం ప్రకారం కుండలినీ శక్తి పీఠం గుదస్థానం మర్మస్థానం మధ్యలో వుంటుంది. స్త్రీలకు యోని స్థానంలో వుంటుంది. ఇది అండం ఆకారంలో వుంటుంది. సర్పం చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి వుంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొలిపితే ఆ భౌతికకాయం జీవంతో వున్నంతవరకు శక్తి వుంటుంది. శరీరంలోని నాడులన్నిటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని. మహా శక్తివంతమైన కుండలినీ శక్తిని జాగృతం చేయడమే యోగాభ్యాసంలోని అత్యున్నత స్థితి. మానవ శరీరమే దేవుని నిలయం. మన శరీరంలోనే ఎన్నో అధ్బుతాలున్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే వీటిని మనం దర్శించగలం.


శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితి శక్తి (Potential Energy), రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy). శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.


కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి (purification of body), నాడీ శుద్ధి (purification of nadis/nervous system), మనో శుద్ధి (purification of mind), బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి. నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.




 Click for KUNDALINI Rendition






Translate