Yogavasista

క్రియాయోగి ప్రాణశక్తి



క్రియాయోగము
                                   రవి (సహస్రార)
కుంభం
బుధ(ఆజ్ఞ)
మీనం
ధనుస్సు
శుక్ర (విశుద్ధ )
మకరం
తుల
చంద్ర (అనాహత)
వృశ్చికం
సింహ
కుజ (మణిపుర)
కన్య
మిథునం  
గురు( స్వాధిష్ఠానం)
కటకం
మేషం
శని( మూలాధారం) 
వృషభం


మూలాధారమునుండి కూటస్థములోని ఆజ్ఞా + చక్రమువఱకు, ఒక్కొక్క చక్రమునకు ఇరువైపులా ఒక్కొక్క రాశిచొప్పున,  పైనపొందుపరచినవిధముగా రెండు రాశులుఉన్నవి.   క్రియాయోగి తన ప్రాణశక్తిని ఆరు చక్రములలో మూలాధారమునుండి కూటస్థములోని ఆజ్ఞా + చక్రమువఱకు, కూటస్థములోని ఆజ్ఞా + చక్రమునుండి ,మూలాధారము వఱకు త్రిప్పుతూ తద్వారా ఆత్మ సూర్యుణ్ణి ఈ ఆరు చక్రములలో ఇరువైపులా ఉన్న 12 రాశులలో దర్శిస్తూ, ప్రతిచుట్టుకూ ఒక సంవత్సరముచొప్పున కర్మదగ్ధము చేసికొంటాడు. 

క్రియాయోగము లో 

1) హఠయోగము (శక్తిపూరక అభ్యాసములు)  

2) లయయోగము (సోహం మరియు ఓంకార క్రియలు)  

3) కర్మయోగము (సేవ)  

4) మంత్రయోగము (చక్రములలో బీజాక్షర ఉచ్చారణ) 

5) రాజయోగము (ప్రాణాయామ పద్ధతులు ) ఉండును. 

ఒకడికి జననకాలములో ఉన్న గ్రహస్థితికి అర్థం మానవుడు గతం చేతిలో కీలుబోమ్మకాడు/కాదు.  అతడు గర్వించదగ్గ సాధనం ధ్యానము. మానవుడు ప్రతిఒక్క బంధాన్ని త్రెంచుకొని స్వేచ్ఛపొందాలన్న సంకల్పం అతనిలో రగుల్కొల్పడమే దాని ఉద్దేశ్యం. 

దైవసాక్షాత్కారము కోసరము శాస్త్రీయమయిన ఒక పద్ధతిని వివాహితుడయినను, కాకపోయినను సాధన చేసేవారు ఎవరయినా యోగే. ఖచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై దానిద్వారా మనస్సును శరీరమును క్రమశిక్షణలో పెట్టుకొని క్రమముగా ఆత్మముక్తిని సాధిస్తాడు.   



  

కుండలిని



కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడుహఠయోగం ప్రకారం కుండలినీ శక్తి పీఠం గుదస్థానం మర్మస్థానం మధ్యలో వుంటుంది. స్త్రీలకు యోని స్థానంలో వుంటుంది. ఇది అండం ఆకారంలో వుంటుంది. సర్పం చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి వుంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొలిపితే ఆ భౌతికకాయం జీవంతో వున్నంతవరకు శక్తి వుంటుంది. శరీరంలోని నాడులన్నిటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని. మహా శక్తివంతమైన కుండలినీ శక్తిని జాగృతం చేయడమే యోగాభ్యాసంలోని అత్యున్నత స్థితి. మానవ శరీరమే దేవుని నిలయం. మన శరీరంలోనే ఎన్నో అధ్బుతాలున్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే వీటిని మనం దర్శించగలం.


శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితి శక్తి (Potential Energy), రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy). శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.


కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి (purification of body), నాడీ శుద్ధి (purification of nadis/nervous system), మనో శుద్ధి (purification of mind), బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి. నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.




 Click for KUNDALINI Rendition






చక్ర స్థానములు


యోగ సాధనలొ చక్రము అనగా కుండలిని ఉద్దీపన స్థానములు . దీనినే కుండలిని స్థానములు  అని కూడ అందురు. మానవ శరీరమునందు మూలాధారము నుండి స్వాధిష్టానము వరకు 7 చక్ర స్థానములు గలవు. యోగ సాధనము ద్వారా ఈ కుండలిని చక్ర స్థానములను ఉద్దీపనము చేయవచ్చును. కఠోరమైన సాధన ద్వారా కుండలినీ శక్తిని మేల్కొలపగలుగుతారు. ఇది హఠ యోగం వల్ల సాధ్యపడుతుంది. లేదా మంత్ర జపం వల్ల కూడా సాధ్యమే! 



శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవునియందు ఏడు చక్రములుండును.


  • మూలాధార చక్రము
  • స్వాధిష్టాన చక్రము
  • నాభి చక్రము
  • హృదయచక్రము
  • కంఠ చక్రము
  • ఘంటికాచక్రము
  • భ్రూవుచక్రము

  • బ్రహ్మరంధ్రము
  • గగన చక్రము




మూలాధార చక్రము: గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.



మర్మస్థానానికి -గుదస్థానానికి మధ్యలో వెన్నుపాముకు చివరగా వుండేది మూలాధార చక్రము. ఇది ఎడ్రినల్‌ గ్రంధికి శక్తిని అందజేస్తుంది. హఠాత్తుగా ఎదురయ్యే వివిధ అనుభవాలను, సంఘటనలను ఎదుర్కొనేందుకు ఈ గ్రంధి తగిన ఆజ్ఞలను జారీ చేస్తూవుంటుంది. పెద్ద ప్రేవులకు, కాళ్ళకు, పాదాలకు, పిరుదుల వద్ద వుండే ఎముకలకు అవసరమైన శక్తి ఇస్తుంది.


ఈ చక్రం దెబ్బతిన్నా, మూసుకుని పోయినా స్థూలకాయం, సయాటికా, ఆర్థ్రైటిస్‌ వంటి వ్యాధులు వస్తాయి. నాడీ వ్యవస్థ, కణవ్యవస్థలను నియంత్రిస్తుంది. 'ఆన్‌రెక్సియా నర్వోసా' వంటి వ్యాధులు రావటానికి ప్రధాన కారణం మూలాధార బలహీనపడటమే. ఇది ఎరుపురంగును కలిగివుంటుంది. పృధ్వీతత్వాన్ని కలిగివుంటుంది.



స్వాధిష్ఠాన చక్రము: లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలదిరక్త ప్రసరణ వ్యవస్థకు, మూత్రపిండాలకు శక్తిని చేకూర్చేది స్వాధిష్ఠాన చక్రము. పురుషులలో వృషణాలకు, స్త్రీలలో అండాశయానికి ప్రాణాన్ని అందిస్తుంది. మొత్తం ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతా స్వాధిష్ఠాన చక్ర ఆధీనంలోనే వుంటుంది. పిత్తాశయాన్ని నియంత్రిస్తుంది. రుచి, ఊపిరికి సంబంధించిన జ్ఞానాన్ని కలుగజేస్తుంది. 






















ఈ చక్రము ఎప్పుడైనా శక్తీహీనంగా తయారైతే జననాంగాలు, మూత్రపిండాలు దెబ్బతింటాయి. వెన్ను నెప్పికూడా వచ్చే అవకాశం వుంది. సంతానోత్పత్తి శక్తి క్షీణిస్తుంది. శృంగార సంబంధమైన భావాలు ఉద్భవించేందుకు స్వాధిష్ఠాన చక్ర దోహదం చేస్తుంది. మూర్తిత్వానికి ఒక రూపును కల్పించేది స్వాధిష్ఠాన చక్రము.


మణిపూరక చక్రము: నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. ఇది పక్కటెముకలకు కింద భాగంలోనూ, ఉదరభాగానికి పైనవుంటుంది. పాంక్రియాస్‌ గ్రంధులను నియంత్రించేది మణిపూర చక్ర. పొట్ట, కాలేయము, ప్లీహము, పిత్తాశయాలకు ప్రాణాన్ని ఇచ్చేది ఈ మణిపూర చక్ర.





జీర్ణవ్యవస్థ, మూత్ర విసర్జకవ్యవస్థకు సంబంధించి అనారోగ్యం చోటుచేసుకుంటే మణిపూర చక్ర బలహీనపడటమో లేక శక్తిహీనమవటమో జరిగిందని గ్రహించాలి. కణజాల వ్యవస్థను నియంత్రిస్తుంది. జీవప్రక్రియ ఏ విధంగా జరగాలో సూచిస్తుంది. ఇది అగ్ని స్వభావాన్ని కలిగి వుంటుంది. మధుమేహం, కాలేయసమస్యలు, అల్సర్లు ఈ చక్రం శక్తిహీనమైతే వస్తాయి. ఇది ఎరుపురంగులో వుంటుంది.


అనాహత చక్రము: హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము. హృదయానికి అవసరమైన శక్తిని అనాహతచక్రం ఇస్తుంది. ఇది హృదయస్థానం వద్ద వుంటుంది. 



పంచజ్ఞానాలకు ఇది కేంద్రము. చేతులు, ధైమస్‌ గ్రంధి, ఊపిరితిత్తులకు కూడా శక్తిని అందజేస్తుంది. ఈ చక్ర దెబ్బతింటే హృదయసంబంధ వ్యాధులు, ఉబ్బసం వంటి అనేక వ్యాధులు వస్తాయి. ఇతరుల పట్ల మెలిగే తీరును ఈ చక్రం నిర్దేశిస్తుంది. ఒక వ్యక్తి ఇతరులతో సత్సంబంధాలను కలిగి వుంటే ఆ చక్రం అత్యంత క్రియా శీలకంగా పనిచేస్తోందని గుర్తించవచ్చు. 'రేకి' మాస్టర్స్‌ మొట్ట మొదటగా తమ చికిత్సను అనాహత చక్రం నుంచే ప్రారంభిస్తారు. విశ్వశక్తి ఇక్కడనుంచి శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరిస్తుంది. వ్యాధిని నిర్మూలించి శారీరక, మానసిక వ్యవస్థలను క్రమబద్ధం చేస్తుంది.



విశుద్ధి చక్రము: కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. గొంతు పై భాగంలో విశుద్ధ చక్ర వుంటుంది. చెవులు, స్వరపేటిక, భుజాలు, గొంతు, చేతులు, థైరాయిడ్‌ గ్రంధులను నియంత్రిస్తుంది. 




విశుద్ధ చక్ర సక్రమంగా పనిచేస్తే ఇతరులను ఆకట్టుకునే రీతిలో సర్వస్థాయి వుంటుంది. ఈ చక్రం పనిచేయకుంటే థైరాయిడ్‌ గ్రంధులు, పారా థైరాయిడ్‌ గ్రంధులు సరిగ్గా పనిచేయవు. వినికిడిలోపం, జలుబు, గొంతు పడిశెం, టాన్సిల్స్‌ వంటి వ్యాధులు వస్తాయి. స్వరపేటికకు సంబధించిన వ్యాధులు కూడా వస్తాయి. విశుద్ధ చక్రను శక్తిమంతం చేస్తే ఈ వ్యాధులు నిర్మూలించబడతాయి.



ఆజ్ఞా చక్రము: భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. రెండు కనుబొమల మధ్య అంటే భ్రూస్థానంలో ఆజ్ఞా చక్ర ఉనికి. 



ఆజ్ఞా చక్రము కంటి చూపును నియంత్రిస్తుంది. మెదడుకు, నాడీవ్యవస్థకు ఈ ఆజ్ఞలు జారీ చేస్తుంది. పిట్యుటరీ, పినియల్‌ గ్రంధులకు ప్రాణాన్నిస్తుంది. చేతనత్వాన్ని, ఏకాగ్రతను పెంపొందించటంలో ఆజ్ఞాచక్ర నిమగ్నమై వుంటుంది.




సహస్రార చక్రము: బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.




వేయిరేకులతో కూడిన కమలం ఆకారంలో ఈ చక్రం వుంటుంది. ఈ చక్రాన్ని ఉత్తేజితం చేయగలిగిన వారెవరైనా ఈ చరాచర సృష్టిపైన ఆధిక్యతను కనబరుస్తారు. వారు ఏ రూపంలో అయినా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. శిరస్సులో వెనుకభాగం వైపు సహస్రార చక్రం ఉనికి వుంటుంది. సెరిబ్రల్‌ కార్టెక్స్‌ను ఇది ఉత్తేజితం చేస్తుంది. చేతనత్వానికి ఒక రూపు కల్పించేందుకు, వివిధ భావాలను, సమన్వయం చేసేందుకు సహస్రారచక్ర పనిచేస్తుంది. సమస్త అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని భద్రపరుస్తుంది. సహస్రార చక్ర శక్తిహీనంగా మారితే విచారం, దిగులు, నిరాశ, నిస్పృహ వంటి భావనలు కలుగుతాయి. ఆత్మహత్యా యత్నానికి సంబంధించిన భావాలు వస్తాయి.

























Translate