Yogavasista

మహాముద్ర



మహాముద్ర:

తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.   కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండ వలయును.. నోరు పూర్తిగా తెరిచి శ్వాస పూర్తిగా బయటికి వదలవలయును. నాలుక వెనక్కి ముడిచి అంగిటిలో కొండనాలుక క్రింద ఉంచవలయును. దీనిని ఖేచరీ ముద్ర అంటారు. నోరు బాగా తెరిచిఉంచుకొనవలయును.


ఖేచరీ ముద్రలోఉండి కాళ్ళు బారజాచుకోవాలి. ఎడమ కాలి నడమ గుదస్థానము క్రింద ఉంచవలయును. కుడికాలును పూర్తిగా వెనక్కిలాగి ముడుచుకొని కూర్చొనవలయును. ఇలా గొంతుకూర్చోని ఖేచరీ ముద్రలో ఉండాలి. ఖేచరీ ముద్రలోఉండి నోరు బాగా తెరిచిఉంచుకొని శ్వాస పూర్తిగా లోపలికి తీసుకోవాలి. ఎడమ కాలి నడమ గుదస్థానము క్రిందనే ఉంచి శ్వాస పూర్తిగా బయటికి వదలుతూ కుడికాలును పూర్తిగా బారజాచుకోవాలి. రెండు చేతివ్రేళ్ళతో కాలివ్రేళ్ళను గట్టిగా చుట్టి పట్టుకోవాలి. చుట్టి పట్టుకొనేటప్పుడు కుడికాలును వంచకూడదు. 


అదేసమయములో తలనువంచి ఆ వంచినతలతో మోకాలుచిప్పను తాకాలి.  ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగా లోపలికి తీసుకుంటూ కుడికాలును పూర్తిగా వెనక్కి తీసుకుంటూ కుడికాలి నడమ గుదస్థానము క్రింద ఉంచవలయును. ఇప్పుడు ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగా బయటికి వదలుతూ ఎడమ కాలును పూర్తిగా బారజాచుకోవాలి.  రెండు చేతివ్రేళ్ళతో కాలివ్రేళ్ళను గట్టిగా చుట్టి పట్టుకోవాలి. చుట్టి పట్టుకొనేటప్పుడు ఎడమ కాలును వంచకూడదు. అదేసమయములో తలను వంచి ఆ వంచినతలతో మోకాలుచిప్పను తాకాలి. 

ఇప్పుడు ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగాలోపలికి తీసుకుంటూ ఎడమ కాలును పూర్తిగా వెనక్కి తీసు కోవాలి. ఇప్పుడు రెండుకాళ్ళు ఒకచోట చేరినవి. అలాగే గొంతు కూర్చోని రెండు చేతివ్రేళ్ళతో ఆ రెండు మోకాళ్ళను  గట్టిగా చుట్టి పట్టుకోవాలి.  ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగా బయటికి వదలుతూ రెండు కాళ్ళు బారజాచుకుంటూ తలను వంచి ఆ వంచినతలతో బారజాచిన ఆ రెండు రెండు కాళ్ళ మోకాలుచిప్పలను తాకుతూ ఆ రెండు కాళ్ళ వ్రేళ్ళను రెండు చేతివ్రేళ్ళతో గట్టిగా చుట్టి పట్టుకోవాలి. ఖేచరీ ముద్రలోనే ఉండి నోరు బాగా తెరిచిఉంచుకొనే శ్వాస పూర్తిగా లోపలికి తీసుకుంటూ రెండు కాళ్ళను వెనక్కి తీసుకొని గొంతు కూర్చొనవలయును.  ఇప్పుడు ఒక మహాముద్ర అయినది.  

ఇప్పుడు ఎడమ కాలి నడమ గుదస్థానము క్రింద ఉంచవలయును. తిరిగి పయిన చెప్పిన విధముగా చేయవలయును. ఇలా మూడు మారులు మూడు ముద్రలు వేయవలయును.





క్రియ 1:

తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.   కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీముద్రలో ఉండ వలయును..

ఖేచరీముద్రలోఉండి నోరు పూర్తిగా తెరిచి శ్వాస పూర్తిగా లోపలికి తీసికోవాలి. శ్వాస మేరుదండములోని ఇడా పింగళ సూక్ష్మనాడులమధ్యనున్న సుషుమ్నా సూక్ష్మనాడి ద్వారా  మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా నెగటివ్, మరియు ఆజ్ఞా పాజిటివ్ చక్రము వరకు ఆరోహణా క్రమములో  వెళ్తున్నట్లుగా భావించాలి. మనస్సు మరియు దృష్టి ఆ శ్వాసను అనుసరించాలి. ఖేచరీముద్రలో నోరు పూర్తిగా తెరిచి లోపలికి తీసికునే శ్వాస శివ బీజమంత్రము. దీనినే సోమ అంటారు.





అదేవిధముగా శ్వాస పూర్తిగా వదలుతూ ఆ శ్వాస మేరుదండములోని ఇడా పింగళ సూక్ష్మనాడులమధ్యనున్న సుషుమ్నా సూక్ష్మనాడి ద్వారా  ఆజ్ఞా పాజిటివ్ , ఆజ్ఞా నెగటివ్, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాధార,  చక్రముల  ద్వారా బయటికి అవరోహణా క్రమములో  వెళ్తున్నట్లుగా భావించాలి. మనస్సు మరియు దృష్టి ఆ శ్వాసను అనుసరించాలి. ఖేచరీముద్రలో నోరు పూర్తిగా తెరిచి బయటికి వదిలే శ్వాస శక్తి బీజమంత్రము. దీనినే అగ్ని అంటారు.

ఈ విధముగా ఒక శ్వాసను మేరుదండము ద్వారా మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా నెగటివ్, మరియు ఆజ్ఞా పాజిటివ్ చక్రము వరకు ఆరోహణా క్రమములో తీసికొనుట తిరిగి ఆ శ్వాసను ఆజ్ఞా పాజిటివ్ , ఆజ్ఞా నెగటివ్, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాధార,  చక్రముల  ద్వారా బయటికి అవరోహణా క్రమములో బయటికి పంపుట ఒక క్రియ అవుతుంది. ఈ విధముగా క్రియలు చేస్తున్నప్పుడు పవిత్ర ఓంకార నాదము సాధకునకు వినబడుతుంది. విధి అనగా ధర్మమూ. వేద అనగా వినుట. ఓంకార నాదము  వినుట యే వేదవిధి. .  





Translate