Yogavasista

జాతక దోషాలు --- ప్రాణాయామ పద్ధతుల ద్వారా నివారణ



జాతక దోషాలు --- ప్రాణాయామ పద్ధతుల ద్వారా నివారణ



జాతక దోషములు సాధారణంగా ఈ క్రింద విధముగా ఉంటాయి.


1) గురుదోషము  వలన వివాహ విషయంలోనూ,  విద్యా విషయంలోనూ సమస్యలు రావచ్చును.  దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ గ్రహ గురువు కంటే సద్గురువు సలహాతో స్వాధిష్ఠానచక్రమును టెన్స్ చేసి ఆచక్రములో వం అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

2) శుక్ర దోషము  వలన సంతానలోపము, సంసారములో కలతలు కలహములూ, వీర్య లోపములు రావచ్చును. దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ  సద్గురువు సలహాతో విశుద్ధ చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో హం  అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

సూర్యుడు కోడిగుడ్డు (elliptical order) ఆకారముగా తిరుగుతూ ఉంటాడు.  కనుక ఆయన దూరముగా ఉన్నపుడు  చలికాలం, దూరముగా ఉన్నప్పుడు ఎండాకాలం అవుతుంది. పుడమితల్లికి సూర్యుని దూరము మరియు దిశను బట్టి ఎండ, వాన, చలి కాలములు ఏర్పడుతాయి. 

జన్మసమయములో సూర్యుడు ఏ ఇంటికి అనగా ఏ రాశికి దగ్గిరగా ఉంటాడో అది జన్మ లగ్నరాశి అవుతుంది.  ఆజన్మ సమయములో మనిషి మీద  లగ్నరాశి యొక్క మరియు లగ్నరాశికి ఇరుప్రక్కలా ఇళ్ళలో(రాశులలో) ఉన్న గ్రహముల ప్రభావము మనిషి మీద తప్పక ఉంటుంది.

సూర్య కిరణములు భూమిని తాకటానికి ఎనిమిది నిమిషములు పడుతుంది. మనిషి జన్మసమయములో ఉండేస్థలమును బట్టి సూర్య కిరణములు కొంతమంది విషయంలోముందుగా, కొంతమంది విషయంలో తరువాత చేరుతూఉంటాయి.  అది సెకండ్లో  వందోవంతో వెయ్యోవంతో అవ్వచ్చు.  కాని ఆవ్యత్యాసమే మనిషి అదృష్టం నిర్ణయిస్తుంది.  కనుక మనిషి పుట్టిన స్థలము, సమయము గ్రహస్థితిని నిర్ణయించటము, ఆ  గ్రహస్థితి మనకి కర్మ ప్రకారము ఫలితాలు నిర్దేశించటమూ జరుగుతుంది.

3) చంద్రదోషము: చంద్రదోషము  వలన మానసికంగాను,  వాణిజ్యపరంగానూ, ఉద్యోగపరంగానూ  సమస్యలు రావచ్చును.  దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ సద్గురువు సలహాతో అనాహత చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో యమ్ అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు. 

4) శని దోషము:  శనిదోషము  వలన .దరిద్రము, ఇంటిపోరు, కష్టాలు ,మానహాని, వ్యవహార చిక్కులు కలుగును. దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ  సద్గురువు సలహాతో మూలాధార చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో లం  అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

5) కుజదోషం:   శతృవుల వలననూ, స్వయంకృతాపరాధము వలనను  చిక్కులు కలుగును.  దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ  సద్గురువు సలహాతో మణిపుర చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో రమ్  అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

6) బుధదోషం : వ్యాపారపరంగానూ, వాచాలత వలననూ , విద్యాపరమైన చిక్కులు కలుగును.. సద్గురువు సలహాతో అజ్ఞా  చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో ఓమ్   అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్ పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

7) రవిదోషం:  విద్య, ఆధ్యాత్మిక న్యూనత లేక శూన్యత, ఆర్ధిక పరమైన చిక్కులు కలుగును.. సద్గురువు సలహాతో సహస్రార   చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో రామ్   అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్ పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.




నవగ్రహస్తోత్రము

సప్తాశ్వరధమారూఢం  ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరమ్ దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్

ఏడుగుఱ్ఱములను (ఏడుచక్రములు) అధిరోహించువాడును, ప్రచండమైన కాంతిగలవాడును అనగా ఆజ్ఞానమును దూరము చేయువాడునూ, కశ్యప మహర్షి కుమారుడును అనగా శుద్ధ బుద్ధి ప్రదాతయూ, తెల్లనిపద్మమును ధరించినవాడును అనగా జ్ఞానమునకు ప్రతీకుడునూ అయిన సూర్యదేవునికి నమస్కరిస్తున్నాను.
ఇక్కడ సప్తాశ్వరధమారూఢం అనగా మూలాధారము నుండి సహస్రారము వరకున్న ఏడు చక్రములను అనగా ఏడులోకములను ప్రకాశవంతముచేసి జ్ఞానవంతము చేసేవాడు అని అర్థము.  రవి ఆత్మకు ప్రతీక.


శ్వేతాశ్వ సమారూఢం కేయూర మకుటోజ్వలం
జటాధర శిరోరత్నం తం చంద్రం  ప్రణమామ్యహమ్

తెల్లని గుఱ్ఱమును అధిరోహించువాడును, కేయూరకాంతులు వెదజల్లువాడును, పరమశివుని శిరమున అలంకారముగా ఉన్నవాడును  అయిన  చంద్రదేవునికి నమస్కరిస్తున్నాను.
ఇక్కడ శ్వేతాశ్వ సమారూఢం అనగా బుద్ధికి , జటాధర శిరోరత్నం అనగా మనసుకి అధినేత అని అర్థము.. అనగా పరమశివుడు  మనసు, బుద్ధి రెండింటిని తన ఆధీనములో ఉంచుకున్నవాడు  అని అర్థము. అందువలన శివుని శిరమున అలంకారప్రాయముగా చంద్రుని చూపుతారు.


ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమాప్రభం
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్

భూదేవి గర్భమున జన్మించినవాడును, విద్యుత్ కాంతితో సమానమైన ప్రభ అనగా కాంతి గలవాడును, యవ్వనవంతుడు, శక్తివంతుడునూ, మంగళప్రదుడునూ, అయిన  కుజ(మంగళ) దేవునికి నమస్కరిస్తున్నాను.


ప్రియంగు కళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం
సౌమ్యం సౌమ్యగుణో పేతం తం బుధం ప్రణమామ్యహమ్

ప్రియమైన శ్యామ వర్ణము గలవాడును, అందమైనవాడును, సౌమ్యుడునూ, అయిన  బుధ దేవునికి నమస్కరిస్తున్నాను. బుధుడు వ్యాపారమునకు సంబంధించిననవాడు. దానిని సాధకుడు ఆధ్యాత్మిక వ్యాపారమునకు అనగా ఆధ్యాత్మికప్రగతికి అనుకూలించుకొనుటకు ఆయనని ప్రార్థించవలెను.


దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం
బుద్ధిపూతం త్రిలోకేశం తం గురుం  ప్రణమామ్యహమ్

దేవతలకు ఋషులకు బంగారము అనగా  గొప్ప గురువునూ, బుద్ధిమంతుడునూ, త్రిలోకపూజితుడునూ , అయిన  గురు దేవునికి నమస్కరిస్తున్నాను.  గురువు సాత్వికగుణమునకు, జ్ఞానము, వేదాంతం, విద్య మరియు సుఖమునకు ప్రతీక.


హిమకుండమృణాలాభం దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తానాం తం శుక్రం ప్రణమామ్యహమ్

తెల్లని వాడునూ, రాక్షసులకు గురువునూ, సర్వశాస్త్రకోవిదుడు అయినప్పటికీ  అహంకారముతో కూడి సంసారబంధమోహము కలగజేయువాడునూ, వీర్యమునకు ప్రతీక అయిన శుక్ర దేవునికి నమస్కరిస్తున్నాను.  సంసారము(నీరు)లో నావ (మనిషి) ఉండవచ్చు. నావ (మనిషి) లో నీరు(సంసారము) ఉండరాదు. దీనినే సంసారబంధమోహము అంటారు. 


నీలాంజన సమాభూతం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం శనిం  ప్రణమామ్యహమ్

నల్లనివాడునూ, రవికి కుమారుడునూ, యమునికి అన్నయ్యనూ, ఛాయాదేవికి (అజ్ఞానం) రవికి (పరమాత్మ చైతన్యము) పుత్రుడునూ అయిన శనిదేవునికి నమస్కరిస్తున్నాను. మల, విక్షేప, ఆవరణ దోషములవలన  పరమాత్మచైతన్యమును  గుర్తించని జ్ఞానమునే , ఛాయా మార్తాండ సంభూతం అయిన ఆజ్ఞానము.  శని తామసగుణమునకు ప్రతీక. అందువలన దుఃఖదుడు.


అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం తం రాహుం  ప్రణమామ్యహమ్

అర్థ శరీరము గలవాడునూ,  మహావీరుడునూ, చంద్ర అనగా మనస్సును  మరియు రవిని అనగా ఆత్మను (బుద్ధిని)  పీడించువాడునూ, సింహిక అనగా మనస్సు. అహంకారముతో కూడినవాడునూ  అయిన రాహు దేవునికి నమస్కరిస్తున్నాను.  


ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
రౌద్రం  రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్

మోదుగ పుష్పకాంతి గలవాడునూ, నక్షత్రములకు మరియు గ్రహములకు తలపై నుండు వాడునూ,  రౌద్ర స్వభావము గాలవాడునూ, రుద్రుని కుమారుడునూ అనగా తామస స్వభావుడునూ, ఘోరమయినవాడునూ, అయిన కేతుదేవునికి నమస్కరిస్తున్నాను.

ఒక్కొక్క చక్రము ఒక్కొక్క గ్రహమునకు ప్రతీక. రాహు కేతువులు ఛాయాగ్రహములు.  కనుక వాటికి ప్రత్యేక స్థానములు ఇవ్వలేదు. 

సహస్రారము--------రవి
ఆజ్ఞా ----------------బుధ
విశుద్ధ -------------శుక్ర
చంద్ర---------------అనాహత
కుజ---------------మణిపుర
గురు--------------స్వాధిస్ఠానం
శని----------------మూలాధారం

మన శరీరములో 72,000 సూక్ష్మనాడులున్నవి. వాటిలో 3 సూక్ష్మనాడులు ముఖ్యమైనవి. అవి ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి. ఇడ మేరుదండములో ఎడమవైపున, పింగళ మేరుదండములో కుడి వైపున మరియు సుషుమ్న మేరుదండములో ఇడ, పింగళ మధ్యన ఉండును.  మూలాధారం నుండి ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి ఆజ్ఞావరకు కలిసి ఉంటాయి. ఆజ్ఞాచక్రము నుండి సహస్రారము వరకు సుషుమ్నమాత్రమె ముందుకు సాగును.  ఇడ  నకారాత్మక్రియలకు (negative)   పింగళ సకారాత్మ క్రియలకు(positive)  మరియు చ తటస్థ క్రియలకు (neutral).  ప్రతీకలు. సాధకుని లక్ష్యము మూలాధారచక్రము క్రింద ఉన్న కుండలినీ శక్తిని తన సాధనతో  సుషుమ్నద్వారా సహస్రారమునాకు చేర్చుట.  అందుకు విరుద్ధంగా ఇడ వైపు గానీ, , పింగళ వైపు గానీ కుండలినీ శక్తిని పంపగూడదు. పంపినయడల విపరీత స్వభావమును ధ్యానసమయమున పొందును. ఉదాహరణకి అనాహతలో ఇడ వైపు కుండలినీ శక్తి నడిచిన ద్వేషము, పింగళ వైపు నడిచిన అతిప్రేమ(మోహము) కలుగును.  అదే కుండలినీ శక్తిని సుషుమ్నద్వారా నడిపించిన మోహము ఉండదు, ద్వేషము ఉండదు.   ఏడు చక్రములలోను ఓంకారోచ్ఛారణ , బీజమంత్రోచ్ఛారణలాంటి 12 క్రియలు  చేయుట వలన నవగ్రహములవలన కలుగు అనేక దోషములను సమూలముగా నివారించుకొనవచ్చును. ఈ క్రియలు అతి సులభముగా నేర్చుకొనవచ్చును.

ఆరోగ్యకరమయిన వ్యక్తీ రోజుకి 21,600 శ్వాస నిశ్వాసలు చేస్తాడు.  అనగా ఒక నిమిషము నకు 15 శ్వాస నిశ్వాసలు చేస్తాడు. మనిషి పుట్టినపుడు తనతోపాటు ఇన్ని హంసలు అనగా శ్వాస నిశ్వాసలను తెచ్చుకుంటాడు. ప్రాణాయామ పద్ధతులద్వారా  ఈ శ్వాస నిశ్వాసలను సాధకుడు నియంత్రణ చేసికొని అతి తక్కువ శ్వాస నిశ్వాసలను చేసి తనజీవితాన్ని పొడిగించుకోగలడు.  ఈ విధముగా మార్కండేయ తన జీవితాన్ని పొడిగించుకొని చిరంజీవి అయినాడు. క్రియాయోగ ప్రాణాయామ పద్ధతులద్వారా తన జీవితాన్ని తను నియంత్రించుకోగలడు.  పరమహంస శ్రీ శ్రీ యోగానందలాంటి వారు తనకి జ్యోతిష్యము ప్రకారము జరగవలసిన రెండు వివాహములను క్రియాయోగ ప్రాణాయామ పద్ధతులద్వారా జరగకుండా చేసికోగలిగారు.  కనుక అటువంటి మహానుబావులను స్ఫూర్తిగా తీసికొని మనము కూడా క్రియాయోగ ప్రాణాయామ పద్ధతులద్వారా  పరమాత్మను పొందగలము. 



Translate